విశాఖ రైల్వే జోన్ ఉందా? లేదా?: రామకృష్ణ

ABN , First Publish Date - 2021-12-10T02:50:37+05:30 IST

రాష్ట్రానికి విశాఖ రైల్వే జోన్ ఉందా, లేదా అని కేంద్రాన్ని

విశాఖ రైల్వే జోన్ ఉందా? లేదా?: రామకృష్ణ

అమరావతి: రాష్ట్రానికి విశాఖ రైల్వే జోన్ ఉందో, లేదో సమాధానం చెప్పాలని కేంద్రాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. కొత్తగా రైల్వే జోన్లు ఏర్పాటు చేసే ఆలోచన లేదని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంటులో ప్రకటించారని ఆయన పేర్కొన్నారు. నిన్న రైల్వే మంత్రి ప్రకటనతో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై సందిగ్ధం నెలకొందని ఆయన అన్నారు.  ఏపీకి చెందిన పార్లమెంటు సభ్యులు ఇప్పటికైనా గళమెత్తాలని సూచించారు. విశాఖ రైల్వే జోన్ సాధించేందుకు కృషి చేయాలని ఎంపీలకు ఆయన హితవు పలికారు. 



Updated Date - 2021-12-10T02:50:37+05:30 IST