సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాల్సిందే...కానీ: Ramakrishna

ABN , First Publish Date - 2021-12-28T14:22:37+05:30 IST

సినిమా టికెట్ల ధరల వివాదాన్ని వెంటనే పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు.

సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాల్సిందే...కానీ: Ramakrishna

అమరావతి:  సినిమా టికెట్ల ధరల వివాదాన్ని వెంటనే పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. సినిమా టికెట్లు, తినుబండారాలు, పార్కింగ్ ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాల్సిందే అని స్పష్టం చేశారు. కానీ థియేటర్ల మూసివేత వల్ల సినీ పరిశ్రమ కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, థియేటర్ల యాజమాన్యాలతో చర్చలు జరిపి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని  రామకృష్ణ అన్నారు. 

Updated Date - 2021-12-28T14:22:37+05:30 IST