అమరావతి: అమరావతి ఉద్యమం చారిత్రాత్మకమైనదని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ 13 జిల్లాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అమరావతిపై ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతున్నామని తెలిపారు. అమరావతి విషయంలో బీజేపీ డ్రామాలాడుతోందని విమర్శించారు. సోలార్ విద్యుత్ కొనుగోలు విషయంలో వేలకోట్లలో గోల్ మాల్ జరుగుతోందన్న అనుమానం కలుగుతోందన్నారు. 22 రాష్ట్రాలు సోలార్ విద్యుత్ కొనుగోలు తిరస్కరిస్తే... ఏపీ ప్రభుత్వం మాత్రం ఒక్కరోజులోనే ఆమోదం తెలిపిందని అన్నారు. అదానీతో జగన్ లాలూచీకి ఇదే నిదర్శనమని రామకృష్ణ వ్యాఖ్యానించారు.