Polavarm project: పోలవరం నిర్మాణం ప్రశ్నార్ధకమేనా?: రామకృష్ణ సూటి ప్రశ్న

ABN , First Publish Date - 2022-07-28T16:47:56+05:30 IST

పోలవరం నిర్మాణం ప్రశ్నార్థకమేనా అంటూ ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ సూటిగా ప్రశ్నించారు.

Polavarm project: పోలవరం నిర్మాణం ప్రశ్నార్ధకమేనా?: రామకృష్ణ సూటి ప్రశ్న

అమరావతి: పోలవరం(Polavaram) నిర్మాణం ప్రశ్నార్థకమేనా అంటూ ప్రభుత్వాన్ని సీపీఐ (CPI) రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ (Ramakrishna) సూటిగా ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పనిపూర్తి, నిర్వాసితులకు పరిహారం విషయంలో జగన్ సర్కార్ (Jagan government) విఫలమైందని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి (Rajashekar reddy) ఆశయాన్ని జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy) నీరుగారుస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుగా మారుతుందా లేక బ్యారేజిగానే మిగిలిపోతుందా అనేది ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై ఒత్తిడి పెంచి నిధులు సాధించటం జగన్మోహన్ రెడ్డికి చేతకాదా అని నిలదీశారు. చేతకాకపోతే పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రానికి అప్పగించేయాలని హితవుపలికారు. కేంద్ర ప్రభుత్వం (Central government)తో జగన్మోహన్ రెడ్డి లోపాయికారి ఒప్పందాన్ని బయటపెట్టాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-07-28T16:47:56+05:30 IST