ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేయాలి: Ramakrishna

ABN , First Publish Date - 2022-07-02T13:54:56+05:30 IST

సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.

ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేయాలి: Ramakrishna

అమరావతి: సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు (AB venkateshwar rao)పై సస్పెన్షన్ ఎత్తివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (Ramakrishna) డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామిక వ్యవస్థలపై జగన్మోహన్ రెడ్డి (Jagan mohan reddy) కక్షపూరిత వైఖరి సరికాదన్నారు. వైసీపీ (YCP)కి వత్తాసు పలకని అధికారులను వేధింపులకు గురిచేయటం వల్ల, అధికారుల్లో అభద్రతాభావం నెలకొందని తెలిపారు. కోర్టు తీర్పులను కూడా లెక్క చేయకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. కక్షసాధింపు చర్యలతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆభాసుపాలైందన్నారు. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేసి, ప్రజలకు వ్యవస్థల పట్ల నమ్మకాన్ని కల్పించాలని రామకృష్ణ పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-02T13:54:56+05:30 IST