అమరావతి: తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు. అంబులెన్స్‌కు రూ.20 వేలు డిమాండ్ చేయటం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. డబ్బు కట్టలేని స్థితిలో బాలుడి మృతదేహాన్ని మోటార్ సైకిల్‌పై 90 కిలోమీటర్లు తీసుకెళ్లటం శోచనీయమన్నారు. ఈ వీడియో తీసిన వారిపై పోలీసులు కేసు పెట్టడం పోలీసుల అసమర్థతకు అద్దం పడుతోందని ఆగ్రహించారు. పోలీసులకు కేవలం ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపడమే పనిగా ఉన్నదన్నారు. విజయవాడలో మానసిక వికలాంగురాలి గ్యాంగ్ రేప్ ఘటన కూడా పోలీసుల వైఫల్యానికి నిదర్శనమన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని, బాధితులకు న్యాయం చేయాలని తిరుపతిలో ఈరోజు సీపీఐ ధర్నా నిర్వహించనున్నట్లు రామకృష్ణ తెలిపారు.
ఇవి కూడా చదవండి