కడప: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై సీపీఐ రాష్ట్ర కార్యరద్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ గురువారం కడప ఆర్డీఓ కార్యాలయం ఎదుట రామకృష్ణ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జగన్ ఆదానీ సోలార్ కంపెనీతో 7 వేల మెగావాట్ల విద్యుత్ కోసం ఒప్పందం చేసుకున్నారని అన్నారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి వారితో ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో విద్యుత్ చార్జీలు పెరిగితే బాదుడే బాదుడు అన్నారని అన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించే వరకు ప్రతిపక్షాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర పెద్దలకు తొత్తుగా జగన్ వ్యవహరిస్తున్నారని రామకృష్ణ విమర్శలు గుప్పించారు.
ఇవి కూడా చదవండి