తిరుపతి: రాష్ట్రంలో ఆదాయం తగ్గిపోతే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి 2లక్షల 56వేల కోట్ల భారీ బడ్జెట్ అసెంబ్లీలో ఎలా ప్రవేశపెట్టారు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... 6 లక్షల కోట్లు అప్పులు చేసి ఎక్కడైనా అభివృద్ధి చేశారా అని నిలదీశారు. అప్పులు, అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మూడు సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక్క కొత్త పరిశ్రమ అయినా రాష్ట్రానికి వచ్చిందా అని ఆయన అన్నారు. ఉపముఖ్యమంత్రి పదవి అంటే ఏంటో సరిగ్గా తెలియకనే వారిని ఇంటికి పంపి జగన్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి పదవి లేకపోతే ఇంకా రెచ్చిపోతానంటూ కొడాలినాని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రుల బూతుమాటలతో సిఎం ఎంజాయ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయాలో హుందా తనం ఉండాలని, వైసీపీ మంత్రుల వల్ల విలువలు క్షిణిస్తోందని, ప్రజలు అసహ్యించుకుంటున్నారని రామకృష్ణ అన్నారు.
ఇవి కూడా చదవండి