Abn logo
May 14 2021 @ 12:38PM

వారి మరణాలకు తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాలి: రామకృష్ణ

అమరావతి: పోలీసులు ఆపడం వల్ల ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో చనిపోయిన కరోనా రోగుల మరణాలకు తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ వెళ్తున్న దాదాపు 100 అంబులెన్సులను తెలంగాణ పోలీసులు ఆపటం దుర్మార్గమని మండిపడ్డారు. నంద్యాల, కడపకు చెందిన ఇద్దరు కరోనా రోగులు మరణించడం బాధాకరమన్నారు. తెలంగాణ హైకోర్టు చెప్పినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు కనీస మానవత్వం లేకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఏపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని రామకృష్ణ ఖండించారు. 

Advertisement