నారాయణ హౌస్ అరెస్ట్ అక్రమం: రామకృష్ణ

ABN , First Publish Date - 2021-05-11T17:21:09+05:30 IST

సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ హౌస్ అరెస్టును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు.

నారాయణ హౌస్ అరెస్ట్ అక్రమం: రామకృష్ణ

అమరావతి: సీపీఐ  జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ హౌస్ అరెస్టును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు.  నారాయణ తిరుపతి వెళ్తుండగా మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకొని, అరెస్టు చేయటం అక్రమమన్నారు. ప్రజాస్వామిక విధానాలకు ప్రభుత్వ, పోలీసు చర్యలు పెను విఘాతం అని వ్యాఖ్యానించారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో మరణించిన వారికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరా లోపంతో జరిగిన మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఎక్కడెక్కడ ఎన్ని మరణాలు సంభవించాయో రాష్ట్ర ప్రభుత్వం వివరాలు చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Updated Date - 2021-05-11T17:21:09+05:30 IST