ఆర్థికస్తోమత లేదని కేంద్రం చెప్పడం దివాళాకోరుతనమే: నారాయణ

ABN , First Publish Date - 2021-06-21T17:08:45+05:30 IST

కోవిడ్‌తో చనిపోయిన వారికి రూ. 5 లక్షల పరిహారం ఇవ్వడానికి ఆర్థికాసోమత లేదని కేంద్రం..

ఆర్థికస్తోమత లేదని కేంద్రం చెప్పడం దివాళాకోరుతనమే: నారాయణ

న్యూఢిల్లీ: కోవిడ్‌తో చనిపోయిన వారికి రూ. 5 లక్షల పరిహారం ఇవ్వడానికి  ఆర్థికస్తోమత లేదని కేంద్రం సుప్రీం కోర్టుకు  చెప్పడం ప్రభుత్వ దివాళాకోరు తనమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్‌తో నాలుగు లక్షల మంది చినిపోయారని కేంద్రం కోర్టుకు చెప్పిందన్నారు. వారందరికీ పరిహారం ఇవ్వాలంటే దాదాపు  రూ. 14 వేల కోట్లు ఖర్చుఅవుతుందని, అంత ఆర్థిక స్తోమత కేంద్రం భరించలేదని ప్రభుత్వం నిస్సిగ్గుగా చెప్పిందని ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నుంచి 18 లక్షల కోట్లు కార్పొరేట్ కంపెనీలకు దోచి పెట్టిందని ఆరోపించారు. పీఎం కేర్‌కు చాలా నిధులు వచ్చాయని, ఎవరికీ లెక్కలు చెప్పడం లేదని విమర్శించారు. పెట్రోల్, డీజీల్ ధరలు మాత్రం కేంద్రం ప్రతి రోజు పెంచుతోందని, పెట్రోల్ లీటరు ధర రూ. 100 దాటిందని నారాయణ మండిపడ్డారు.

Updated Date - 2021-06-21T17:08:45+05:30 IST