సినిమా టికెట్ల విషయంలో జగన్ నిర్ణయం కరెక్ట్...కానీ: Narayana

ABN , First Publish Date - 2022-02-24T19:24:08+05:30 IST

సినిమా టికెట్ల విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం కరెక్ట్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

సినిమా టికెట్ల విషయంలో జగన్ నిర్ణయం కరెక్ట్...కానీ: Narayana

అమరావతి: సినిమా టికెట్ల విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం కరెక్ట్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కొత్త సినిమా అని సినిమా టికెట్ ధర రూ.వెయ్యికి పెంచితే చూస్తూ ఉరుకోలేమన్నారు. అయితే జగన్ ఒంటెత్తు పోకడతో సమస్య వచ్చిందని తెలిపారు. సినిమా వాళ్ళ అందరితో చర్చించి నిర్ణయం తీసుకొని ఉంటే సమస్య ఉండేది కాదని సూచించారు. కొందరితో మాట్లాడారని... రాజకీయ కోణంలో చూడడంతో సమస్యగా మారిందని నారాయణ పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-24T19:24:08+05:30 IST