Abn logo
May 11 2021 @ 11:21AM

రుయాలో మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు ఇవ్వాలి: నారాయణ

తిరుపతి: రుయాలో మరణాలు సర్కారీ హత్యలే అని సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు. మంగళవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ ఆక్సీజన్ ఐదు నిమిషాలు అందలేదని కలెక్టర్ అనటం అబద్ధమన్నారు. ఐదు నిమిషాలు ఆక్సీజెన్ అందకుంటే అన్ని మరణాలు జరగవని తెలిపారు. 26 మరణాలు అని మాకు సమాచారం ఉందని... 11 మరణాలు అని కప్పిపుచుతున్నారని మండిపడ్డారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.25 లక్షలు ఇవ్వాలని నారాయణ డిమాండ్ చేశారు. 

Advertisement