సమస్యలు పరిష్కరించాలని సీపీఐ ధర్నా

ABN , First Publish Date - 2022-08-09T03:49:17+05:30 IST

మున్సిపాలిటీలో పాత పద్ధతి లోనే వృద్ధులకు, మహిళలకు, దివ్యాంగులకు పెన్షన్‌ల ను పంపిణీ చేయాలని సీపీఐ ఆధ్వర్యంలో సోమ వారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించారు. పలు డిమాండ్‌లతో కూడిన వినతి పత్రా న్ని కమిషనర్‌ రాజుకు అందజేశారు. సీపీఐ పట్టణ కార్యదర్శి జోగుల మల్లయ్య మాట్లాడుతూ పెన్షన్‌లను పోస్టాఫీస్‌ ద్వారా ఇవ్వడం వల్ల గంటల తరబడి నిల బడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

సమస్యలు పరిష్కరించాలని సీపీఐ ధర్నా
నస్పూర్‌ మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న సీపీఐ నాయకులు

నస్పూర్‌, ఆగస్టు 8: మున్సిపాలిటీలో పాత పద్ధతి లోనే వృద్ధులకు, మహిళలకు, దివ్యాంగులకు పెన్షన్‌ల ను పంపిణీ చేయాలని సీపీఐ ఆధ్వర్యంలో సోమ వారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించారు. పలు డిమాండ్‌లతో కూడిన వినతి పత్రా న్ని కమిషనర్‌ రాజుకు అందజేశారు. సీపీఐ  పట్టణ కార్యదర్శి జోగుల మల్లయ్య మాట్లాడుతూ పెన్షన్‌లను పోస్టాఫీస్‌ ద్వారా ఇవ్వడం వల్ల గంటల తరబడి నిల బడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అన్ని పెన్ష న్లను బ్యాంకుల ద్వారా పంపిణీ చేయాలని కోరారు. మున్సిపాలిటీలో ఇండ్లు కొన్న వారికి పేరు మార్పిడి చేయకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయ రన్నారు. అర్హులైన వారందరికి తెల్ల రేషన్‌కార్డులు ఇవ్వాలని, రద్దీగా ఉన్న కూడళ్లలో మరుగుదొడ్లను నిర్మించాలన్నారు. కౌన్సిలర్‌ మేకల దాసు, నాయకులు  రవి, కిరణ్‌, మొగిలి, లక్ష్మణ్‌, వెంకటేష్‌, సంపత్‌రావు, కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.  

మందమర్రి: క్యాతన్‌పల్లి మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. కమి షనర్‌ వెంకట్‌నారాయణకు వినతిపత్రం సమర్పిం చారు. జిల్లా కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు రామడుగు లక్ష్మణ్‌, మిట్టపల్లి శ్రీనివాస్‌లు మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో ఆసరా పెన్షన్‌ పోస్టాఫీస్‌ ద్వారా కాకుండా బ్యాంకుల ద్వారా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లైబ్రరీ పునరుద్దరించాలని, ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ను ప్రారంభించాలని, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను ఇవ్వాలని, 1, 2వ వార్డులను ఏజెన్సీ ప్రాంతం నుంచి తీసివేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా సమితి సభ్యులు ఎండీ అక్బర్‌ ఆలీ, నక్క వెంకట్‌స్వామి, సాంబయ్య, రాజేశం,  రమేష్‌, మామిడి గోపి, దుర్గ,  కొమురెల్లి, మొండి, మాదాసు  పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-09T03:49:17+05:30 IST