కేంద్ర నిర్ణయాలపై వామపక్షాల ఆందోళ

ABN , First Publish Date - 2021-02-27T06:05:31+05:30 IST

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణ యం, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెంపుపై సీపీఐ, సీపీఎంల ఆధ్వర్యంలో శుక్ర వారం ఇక్కడి శ్రీకన్య జంక్షన్‌లో నిరసన చేపట్టారు.

కేంద్ర నిర్ణయాలపై వామపక్షాల ఆందోళ
శ్రీకన్య కూడలిలో నిరసన తెలుపుతున్న సీపీఐ, సీపీఎం శ్రేణులు

నర్సీపట్నం అర్బన్‌, ఫిబ్రవరి 26 : స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణ యం,  పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెంపుపై సీపీఐ, సీపీఎంల ఆధ్వర్యంలో శుక్ర వారం ఇక్కడి శ్రీకన్య జంక్షన్‌లో నిరసన చేపట్టారు.  సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు డి.సత్తిబాబు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌, రైల్వే, ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్‌ వంటి సంస్థలు ప్రైవేటీకరణకు కేంద్రం అడుగులు వేస్తుండడం దారు ణమన్నారు. అలాగే పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెరుగుతుండడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని వాపో యారు. మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు మేకా సత్యనారాయణ, సాపిరెడ్డి నారాయణమూర్తి, రామునాయుడు,  గౌరీ, చిరంజీవి, సత్యప్రభ తదితరులు  పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T06:05:31+05:30 IST