Abn logo
Sep 25 2021 @ 00:23AM

అక్టోబరులో నూతన పీఎస్‌ భవనాలు ప్రారంభం

అక్టోబరులో నూతన పీఎస్‌ భవనాలు ప్రారంభం

 పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు

వన్‌టౌన్‌, సెప్టెంబరు 24: భవానీపురం, కృష్ణలంక పోలీసు స్టేషన్లకు నిర్మాణంలో ఉన్న నూతన భవనాలను శుక్రవారం సీపీ బత్తిన శ్రీనివాసులు  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసు స్టేషన్ల నిర్మాణానికి టీడీపీ హయాంలో ఒక్కో భవనానికి కోటి రూపాయలు కేటాయించారు. ఇప్పుడీ భవనాల నిర్మాణాలు పూర్తికావచ్చాయి. అక్టోబరులో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. భవనాలను పరిశీలించిన సీపీ పలు సూచనలు చేశారు. సీపీ వెంట భవానీపురంలో అడ్మిన్‌ డీసీపీ దాసరి మేరీ ప్రశాంతి, డీసీపీ -2 బాబూరావు, వెస్ట్‌ ఏసీపీ హనుమంతరావు, సీఐ మురళీకృష్ణలు ఉన్నారు. కృష్ణలంకలో అడ్మిన్‌ డీసీపీ మేరీ ప్రశాంతి, డీసీపీ-2 బాబూరావు, సౌత్‌ ఏసీపీ రమేష్‌, సీఐ సత్యానందం సిబ్బంది పాల్గొన్నారు.