సైబర్‌ నేరాలు అరికట్టేందుకు CP Stephen Ravindra కీలక నిర్ణయం!

ABN , First Publish Date - 2021-10-09T16:48:58+05:30 IST

సైబర్‌ నేరగాళ్ల ఆటకట్టించడంలో, నేరాల నియంత్రణలో సైబరాబాద్‌ పోలీస్‌ దేశంలోనే...

సైబర్‌ నేరాలు అరికట్టేందుకు CP Stephen Ravindra కీలక నిర్ణయం!

  • ప్రత్యేక ఇన్వెస్టిగేషన్‌ 
  • ఆపరేషన్‌ సెంటర్‌ 

హైదరాబాద్‌ సిటీ : సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేయాలని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర సంకల్పించారు. అందుకు ప్రత్యేక వ్యవస్థ  ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో పోలీసులతో పాటు సైబర్‌ సెక్యూరిటీ, సైబర్‌ క్రైమ్‌పై అవగాహన ఉన్న నిపుణులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. వీరితో పాటు ప్ర త్యేక ఇన్వెస్టిగేషన్‌ ఆపరేషన్‌ సెంటర్‌ (ఐపీసీ) ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేశారు. 


డీసీపీ విజయ్‌కుమార్‌, క్రైమ్స్‌ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, డీసీపీ లావణ్య, సీఆర్‌సీఐడీఎఫ్‌ ప్రసాద్‌ పాటిబండ్ల, సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ సైబర్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌ మేనేజర్‌ మనీష్‌ యాదవ్‌,  సీఆర్‌సీఐడీఎఫ్‌ బృందంతో పాటు సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌లతో శుక్రవారం సీపీ స్టీఫెన్‌ రవీంద్ర సమావేశం నిర్వహించారు. నూతన వ్యవస్థ ఎలా ఉండాలనే అంశంపై చర్చించారు. సైబర్‌ నేరగాళ్ల ఆటకట్టించడంలో, నేరాల నియంత్రణలో సైబరాబాద్‌ పోలీస్‌ దేశంలోనే టాప్‌లో ఉండేలా ప్రత్యేక వ్యవస్థ ఉపయోగపడాలన్నారు.

Updated Date - 2021-10-09T16:48:58+05:30 IST