వరద ప్రాంతాల్లో సీపీ సజ్జనార్‌ పర్యటన

ABN , First Publish Date - 2020-10-19T01:06:02+05:30 IST

వరద ప్రాంతాల్లో సీపీ సజ్జనార్‌ పర్యటన

వరద ప్రాంతాల్లో సీపీ సజ్జనార్‌ పర్యటన

హైదరాబాద్‌: గత నాలుగు రోజుల నుంచి భాగ్యనగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకుపోయాయి. ప్రజలు నానాకష్టాలు పడుతున్నారు. ఇళ్లలోకి వరద నీరు రావడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.


ఈ నేపథ్యంలో 5వ రోజు వరద ప్రాంతాల్లో సీపీ సజ్జనార్‌ పర్యటిస్తున్నారు. పల్లె చెరువు, అప్పచెరువు, గగన్‌పహాడ్‌లో సజ్జనార్‌ పర్యటించారు. అలీనగర్‌, సుబాన్‌కాలనీ, కింగ్స్ కాలనీల్లో ప్రజల్ని అప్రమత్తం చేశామని సీపీ చెప్పారు. వరద బాధితులను షెల్టర్ హోమ్స్‌, సురక్షిత ప్రాంతాలకు తరలించామని సీపీ సజ్జనార్‌ వెల్లడించారు. పల్లె చెరువు కట్టకు రెండు చోట్ల రంధ్రాలను పూడ్చివేశామని, అప్ప చెరువు కట్ట మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ముందు జాగ్రత్తగా ఓల్డ్ కర్నూల్ రోడ్డు బ్రిడ్జి వద్ద.. బెంగళూరు జాతీయ రహదారిపై ఒకవైపు మూసివేశామని సీపీ సజ్జనార్‌ పేర్కొన్నారు.




Updated Date - 2020-10-19T01:06:02+05:30 IST