ఏప్రిల్ 29న హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో ఏం జరిగిందంటే... : సజ్జనార్

ABN , First Publish Date - 2021-05-12T21:14:09+05:30 IST

కూకట్‌పల్లి హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం సెంటర్‌లో ఏప్రిల్ 29 న జరిగిన కాల్పుల ఘటనను తాము ఛేదించామని

ఏప్రిల్ 29న హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో ఏం జరిగిందంటే... : సజ్జనార్

హైదరాబాద్: కూకట్‌పల్లి హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం సెంటర్‌లో ఏప్రిల్ 29 న జరిగిన కాల్పుల ఘటనను తాము ఛేదించామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు. అతి తక్కువ కాలంలోనే ఈ కేసును  ఛేదించామని పేర్కొన్నారు. సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపి 5 లక్షలు దోచుకెళ్లారని, ఈ ఘటనకు సంబంధించి అజిత్ కుమార్, ముఖేష్ కుమార్ అనే నిందితులను అరెస్ట్ చేశామని ఆయన ప్రకటించారు. నిందితులిద్దరూ బిహార్ వాసులని తెలిపారు. వారిద్దరి నుంచి 6 లక్షల 31 వేల నగదు, ఒక వెపన్, మూడు మొబైల్స్‌తో పాటు రెండు టూ వీలర్లను స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు. జీడిమెట్లలో జరిగిన కేసులో కూడా వీరే ప్రధాన నిందితులని, ఆర్థిక ఇబ్బందులతో పాటు మద్యానికి బాసిపై ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని వివరించారు.


 చోరి చేసిన పల్సర్ బైక్ మీద వచ్చి, కూకట్ పల్లిలో కాల్పుకు తెగబడ్డారని తెలిపారు. కాల్పుల్లో సెక్యూరిటీ గార్డ్ అలీ బేగ్ చనిపోయారని వెల్లడించారు. అజిత్ కుమార్ పై గతంలో 2018 దుండిగల్ బ్యాంక్‌లో ఉన్న క్యాషియర్‌ను బెదిరించి పారిపోయాడని, అప్పట్లో అరెస్టై జైలుకు కూడా వెళ్లి వచ్చాడని తెలిపారు. 30 వేలు స్నేహితుడికి ఇచ్చి, కంట్రీ వెపన్ బిహార్ నుంచి తీసుకొచ్చాడని పేర్కొన్నారు. సైంటిఫిక్, టెక్నికల్ ఆధారాలను సేకరించే, నిందితులను గుర్తించామని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-12T21:14:09+05:30 IST