పబ్బులు, Restaurant యజమానులతో సీపీ సమావేశం

ABN , First Publish Date - 2022-05-13T23:46:28+05:30 IST

పబ్బులు, రెస్టారెంట్లు (Restaurant) యజమానులతో సీపీ సీవీ ఆనంద్ సమావేశమయ్యారు. డ్రగ్స్, గంజాయి, హాష్‌ ఆయిల్‌ అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

పబ్బులు, Restaurant యజమానులతో సీపీ సమావేశం

హైదరాబాద్‌: పబ్బులు, రెస్టారెంట్లు (Restaurant) యజమానులతో సీపీ సీవీ ఆనంద్ సమావేశమయ్యారు. డ్రగ్స్, గంజాయి, హాష్‌ ఆయిల్‌ అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అర్ధరాత్రి వరకు ఓవర్ సౌండ్‌తో డీజేలు పెడితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. రోడ్లపై వాహనాలు నిలపకుండా చూడాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనన్నారు. చిన్నపాటి లాభాల కోసం నగరానికి అపకీర్తి తేవొద్దని సూచించారు. పబ్బుల్లో 30 రోజుల బ్యాకప్‌తో సీసీ ఫుటేజ్ ఉండాలన్నారు. రాత్రి 11 తర్వాత ఆర్డర్లను అంగీకరించవద్దని చెప్పారు. రాత్రి 12 లోపే పబ్బులు మూసివేయాలని ఆదేశించారు. శుక్ర, శని వారాల్లో గ్రేస్‌ పిరియడ్‌తో పాటు అదనంగా గంట సమయం కేటాయిస్తామని తెలిపారు. అంతర్జాతీయ ప్రయాణికులు, ప్రతినిధుల కోసం 24 గంటల పాటు.. మద్యం అమ్మకాలకు స్టార్‌ హోటళ్లకు మాత్రమే అనుమతి ఇస్తామని ఆనంద్‌ తెలిపారు.

Read more