Abn logo
Apr 13 2021 @ 00:56AM

నగరంలో డేంజర్‌ బెల్స్‌

నిరంతరం మాస్క్‌ డ్రైవ్‌ 

త్వరలో హాట్‌స్పాట్ల గుర్తింపు 

పోలీసు కమిషనర్‌ శ్రీనివాసులు

విజయవాడ, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి) : ‘నగ రంలో పరిస్థితులు ఏమాత్రం బాగోలేదు. కరోనా కేసు లు బాగా పెరుగుతున్నాయి. కరోనా తొలిరోజుల్లో పా టించిన నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే’.. అం టూ నగర ప్రజలకు, వ్యాపారవేత్తలకు పోలీసు కమిష నర్‌ బత్తిన శ్రీనివాసులు హెచ్చరికలు జారీ చేశారు. కరోనా కేసులు పెరుగుతుండడం, యువత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ప్రయాణాలు సాగిస్తుండడం తో మాల్స్‌, వ్యాపారవేత్తలు, హోటళ్ల ప్రతినిధులతో నగ రంలోని పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో సోమవా రం సాయంత్రం సమావేశం నిర్వహించారు. అనంత రం మీడియాతో మాట్లాడారు. నగరంలో విద్యార్థులు, యువత మాస్క్‌లు ధరించకుండా ప్రయాణాలు సాగి స్తున్నారన్నారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో నిత్యం మాస్క్‌లపై ప్రత్యేక డ్రైవ్‌ చేస్తున్నామన్నారు. గడచిన 15 రోజుల్లో 31,500 కేసులు నమోదు చేశామన్నారు. బస్సులో ప్రయాణించేవారూ ఈవిధంగా నే వ్యవహరిస్తున్నారన్నారు. పటమటలో కరోనా కేసు లు ఎక్కువగా నమోదవుతున్నాయని, త్వరలో హాట్‌ స్పాట్‌లను గుర్తిస్తామని చెప్పారు. రెస్టారెంట్లు, హో టళ్లు, ఇతర షాపింగ్‌మాల్స్‌లో మాస్క్‌లను అందు బాటులో ఉంచాలని ఆదేశించామన్నారు.

Advertisement
Advertisement
Advertisement