కోలీవుడ్: మహేష్‌ హీరోగా ‘క్రిమినల్‌’

కమలా ఆర్ట్స్‌ ప్రొడక్షన్స్‌పై మహేష్‌ సీపీ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘క్రిమినల్‌’. జాహ్నవి అనే నటి ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమవుతోంది. వీరితో పాటు మరికొందరు సీనియర్‌ నటీనటులు కూడా నటిస్తున్నారు. అలాగే, నూతన దర్శకుడు ఆర్ముగం ఈ చిత్రాన్ని సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర కథ విషయానికి వస్తే.. ‘హీరో తండ్రి హత్యకు గురికాగా, ఆ నింద హీరోపైకి వస్తుంది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసేందుకు గాలిస్తుంటే, మరోవైపు తన తండ్రిని హత్య చేసిన హంతకులను గుర్తించి, తాను నిర్దోషినని నిరూపించుకునేందుకు హీరో.. ఆ తర్వాత ఏం చేశాడన్నదే ఈ చిత్ర కథ.

ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ హీరో విజయ్‌ సేతుపతి విడుదల చేసి, దాన్ని తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేసి, చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. అలాగే, టైటిల్‌ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్‌.థాను ఆవిష్కరించారు. ఈ చిత్రం ద్వారా పలువురు టెక్నీషియన్లు తొలిసారి పరిచయంకానున్నారు.

Advertisement