కరోనా కష్టకాలంలో సీపీ మహేష్‌ భగవత్‌ కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2021-05-14T19:22:56+05:30 IST

రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.

కరోనా కష్టకాలంలో సీపీ మహేష్‌ భగవత్‌ కీలక నిర్ణయం

  • ఆక్సిజన్‌ ఆన్‌ వీల్స్‌
  • ఉచిత ప్రాణ వాయు సరఫరా

హైదరాబాద్‌ సిటీ : సకాలంలో ప్రాణవాయువు అందక కరోనా రోగులు కొందరు ఊపిరి వదులుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు సకాలంలో ఆక్సిజన్‌ సరఫరా చేయడానికి ఉచిత వాహన సర్వీ్‌సును ప్రారంభించారు. మహీంద్రా లాజిస్టిక్స్‌ - రాచకొండ పోలీస్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఆక్సిజన్‌ ఆన్‌ వీల్‌ అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం నాలుగు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. ఎల్‌బీనగర్‌లోని సీపీ క్యాంపు కార్యాలయంలో ఆక్సిజన్‌ ఆన్‌వీల్స్‌ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ రీఫిల్లింగ్‌ ప్లాంట్స్‌ నుంచి ప్రభుత్వ ఆస్పత్రులకు ఆక్సిజన్‌ను సరఫరా చేయడం, ఖాళీ అయిన సిలిండర్లను రీఫిల్లింగ్‌ ప్లాంట్స్‌కు తరలించడం ఈ వాహనాల ముఖ్య ఉద్దేశం అన్నారు. వాహన సేవలు అవసరమైన వారు కొవిడ్‌ కంట్రోల్‌ నంబర్‌ 9490617234, మహీద్రార లాజిస్టిక్స్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ +91-7386420259లో సంప్రదించాలన్నారు. 

Updated Date - 2021-05-14T19:22:56+05:30 IST