ప్రజలు చట్టపరిధిలో మెలగాలి

ABN , First Publish Date - 2020-11-25T05:28:53+05:30 IST

నిషేధిత వ్యాపారాలపై పోలీస్‌ శాఖ ఉక్కు పాదం మోపుతుందని, ప్రజలు చట్ట పరిధిలో మెలగాలని సీపీ కమలాసన్‌రెడ్డి అన్నారు.

ప్రజలు చట్టపరిధిలో మెలగాలి
సమావేశంలో మాట్లాడుతున్న సీపీ కమలాసన్‌రెడ్డి

సీపీ కమలాసన్‌రెడ్డి

హుజూరాబాద్‌ రూరల్‌, నవంబరు 24: నిషేధిత వ్యాపారాలపై పోలీస్‌ శాఖ ఉక్కు పాదం మోపుతుందని, ప్రజలు చట్ట పరిధిలో మెలగాలని సీపీ కమలాసన్‌రెడ్డి అన్నారు. మంగళవారం హుజూరాబాద్‌ పట్టణ శివారులోని ఏసీపీ కార్యాలయంలో రెండు గుంటల స్థలంలో ఏర్పాటు చేసిన ఫిష్‌పాండ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం అక్రమ రవాణాపై ప్రభుత్వ నిషేధిత గుట్కా, అంబర్‌ ప్యాకెట్ల వ్యాపారాలపై, ఇసుక రవాణ, పీడీఎస్‌ బియ్యం దందాపై పోలీస్‌ శాఖ ఉక్కు పాదం మోపుతుందన్నారు. ప్రజలు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని సూచించారు. కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని హుజూరాబాద్‌ డివిజన్‌ ఒక ప్రత్యేక స్థానంలో ఉందన్నారు. నేరాల నివారణపై పోలీస్‌ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవడం హర్షనీయమన్నారు. నేరాలు తగ్గుముఖం పడుతున్నా యన్నారు. క్షణికావేశాలకు లోనై ఎవరు నేరాలకు పాల్పడవద్దని సూచించారు. యువత చెడు వ్యసనాలకు గురికావద్దన్నారు. అనంతరం కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్‌రావు, సీఐలు మాధవి, కిరణ్‌, సృజన్‌రెడ్డి, రాములుతో పాటు పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-11-25T05:28:53+05:30 IST