పోలీసు సైరన్‌లపై సీపీ ఆరా

ABN , First Publish Date - 2020-12-06T04:54:55+05:30 IST

ప్రైవేటు వాహనాలకు పోలీసు సైరన్‌లను ఏ ర్పాటు చేసుకొని పోలీసు శాఖను పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తున్న వారిపై నిజామాబాద్‌ పోలీసు బాస్‌ ఆగ్రహంగా ఉన్నారు.

పోలీసు సైరన్‌లపై సీపీ ఆరా
పోలీసు సైరన్‌తో తిరుగుతున్న రుద్రూరు మండలానికి చెందిన వాహనం (ఫైల్‌)

స్టేషన్‌ల వారీగా వివరాలు పంపాలని సీపీ కార్తికేయ ఆదేశం

‘ఆంధ్రజ్యోతి’ కథనంపై పోలీసుల్లో కలవరం

బోధన్‌, డిసెంబరు 5: ప్రైవేటు వాహనాలకు పోలీసు సైరన్‌లను ఏ ర్పాటు చేసుకొని పోలీసు శాఖను పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తున్న వారిపై నిజామాబాద్‌ పోలీసు బాస్‌ ఆగ్రహంగా ఉన్నారు. వారం రోజు ల క్రితం ‘ప్రైవేటు వాహనాలకు పోలీసు సైరన్‌లు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ లో ప్రత్యేక కథనం ప్రచురితం కావడంతో సీపీ స్పందించారు. ప్రైవేటు వాహనాలకు పోలీసు సైరన్‌లు, అత్యవసర వేళల్లో ఉపయోగించే అం బులెన్స్‌ల సైరన్‌లను ఏర్పాటు చేయడంపై సీరియస్‌గా స్పందించారు. జిల్లాలో మండలాల వారీగా ఎక్కడెక్కడ ప్రైవేటు వాహనాలకు పోలీసు సైరన్‌లను ఏర్పాటు చేశారో వివరాలు సేకరించి, ఆ వాహనాల నెంబ ర్లు, యజమాల వివరాలను పంపాలని ఆదేశించారు. దీంతో జిల్లాలోని పోలీసు యంత్రాంగం స్టేషన్‌ల వారీగా వివరాలు సేకరించే పనిలో ని మగ్నమయ్యారు. ప్రైవేటు వాహనాలకు పోలీసు సైరన్‌లను ఏర్పాటు చేసుకొని రాత్రివేళ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండడం పో లీసుల దృష్టికి వచ్చింది. కొందరు ఇసుక మాఫియా, రాత్రివేళ అక్రమ వ్యాపారాలు జరిపే మరికొందరు వ్యక్తులు ప్రైవేటు వాహనాలకు పో లీసు సైరన్‌లను ఏర్పాటుచేసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు మరికొంత మంది వ్యక్తులు టోల్‌గేట్‌ల వద్ద టోల్‌ ఫీజులను చెల్లించకుండా ప్రైవేటు వాహనాలకు పోలీసు సై రన్‌లను ఏర్పాటు చేసుకొని దర్జాగా టోల్‌ గేట్‌లను దాటి వెళ్తున్నారు. టోల్‌ గేట్‌లలో డబ్బులు చెల్లించకుండా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నా రు. ప్రైవేటు వాహనాలకు పోలీసు సైరన్‌లు ఏర్పాటుచేసుకున్న వ్యక్తు ల్లో అధికశాతం అధికార పార్టీ అండదం డలు ఉన్న నేతలు ఉండడంతో వీరంతా కిందిస్థాయిలో పోలీసులపై ఒత్తిడి పెంచారు. తమ వాహనాల కు పోలీసు సైరన్‌లు లేవని, ఉన్న వాటిని తొలగిస్తామని, తమ వివరా లను ఉన్నతాధికారులకు పంపవద్దని ఒత్తిళ్లు పెంచుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారంపై పోలీసుశాఖలోనూ కలవరం మొదలైంది. అయితే, ఈ సైరన్‌లను తొలగించి వదిలేస్తారా? లేదంటే పోలీసు సైరన్‌లను ప్రైవేటు వాహనాలకు ఏర్పాటు చేసుకున్న వ్యక్తు లపై కేసులు నమోదు చేస్తారా? అన్నది పోలీసు బాస్‌ చే తుల్లో ఉంది. జిల్లా వ్యాప్తంగా పోలీసు సైరన్‌లు ఉన్న ప్రై వేటు వాహనాల వివరాలు కొలిక్కివస్తే ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయన్నది తేలే అవకాశం ఉంది. అయితే, అన్ని మండలాల వారీగా ఎస్సైలు, సర్కిల్‌ పరిధిలో సీఐలు పోలీ సు సైరన్‌లు ఉన్న ప్రైవేటు వాహనాలను గుర్తించే పనిలో ని మగ్నమయ్యారు.

Updated Date - 2020-12-06T04:54:55+05:30 IST