Drugs Case: ఇకపై సినిమా వాళ్లకు మినహాయింపు ఉండదు: సీపీ ఆనంద్

ABN , First Publish Date - 2022-01-20T18:31:10+05:30 IST

హైదరాబాద్‌లో డ్రగ్స్ వాడకంపై సీపీ సీవీ ఆనంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ కేసులో సినిమా ఇండస్ట్రీ వాళ్లు ఉన్నారా అన్న ప్రశ్నకు..

Drugs Case: ఇకపై సినిమా వాళ్లకు మినహాయింపు ఉండదు: సీపీ ఆనంద్

హైదరాబాద్ : హైదరాబాద్‌లో డ్రగ్స్ వాడకంపై నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ కేసులో సినిమా ఇండస్ట్రీ వాళ్లు ఉన్నారా అన్న ప్రశ్నకు.. ఇకపై వాళ్లకు మినహాయింపు ఉండదన్నారు. నగరంలో డ్రగ్స్ వాడకమనేది ఇంటింటి సమస్యగా మారుతోందని సీవీ ఆనంద్ చెప్పారు. డ్రగ్స్ వాడే వాళ్లను కట్టడి చేయనంత కాలం.. దీన్ని అరికట్టలేమని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఇక సినీ ప్రముఖులు డ్రగ్స్ కేసులో పట్టుబడితే వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. డ్రగ్స్ వ్యవహారంపై సీఎం, ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉన్నారని సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.


9 మంది అరెస్ట్..

హైదరాబాద్‌లో డ్రగ్స్ వాడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 13 మంది డ్రగ్స్ వినియోగ దారులను గుర్తించామన్నారు. వెయ్యి కోట్ల ఆస్తిపరుడైన కాంట్రాక్టర్ నిరంజన్ కుమార్ జైన్ 30సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు గుర్తించారు. శాశ్వత్ జైన్(కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్) యగ్యానంద్ (స్పైసెస్ బిజినెస్), సూర్య సుమంత్ రెడ్డి, బండి బార్గవ్, వెంకట్ చలసాని, తమ్మినేడి సాగర్, ప్రైవేట్ జాబ్అల్గాని శ్రీకాంత్, ఆఫీస్ బాయ్ బాడి సుబ్బారావులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. వీరంతా ఫైనాన్షియల్‌గా బాగా సెటిల్ అయినవారే కావడం గమనార్హం.

Updated Date - 2022-01-20T18:31:10+05:30 IST