Abn logo
Jul 31 2021 @ 12:55PM

Hyderabad బోనాలకు పూర్తిస్థాయిలో బందోబస్తు: సీపీ

హైదరాబాద్: నగరంలో జరిగే బోనాల పండుగకు పూర్తిస్థాయిలో బందోబస్తు నిర్వహిస్తున్నామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. మహంకాళి లాల్ దర్వాజ టెంపుల్‌తో పాటు సిటీలో ఉన్న అన్ని ఆలయాల్లో పూజలు ఉంటాయని చెప్పారు. ఎల్లుండి రంగంతో పాటు అంబారీ ఊరేగింపు ఉంటుందన్నారు. 8 వేల మంది పోలీసులతో బందోబస్తు ఉంటుందని తెలిపారు. హోమ్ గార్డ్ నుంచి సీపీ వరకు అందరూ బందోబస్తులో పాల్గొంటారన్నారు. ట్రాఫిక్ డైవర్షన్లు కూడా ఉన్నాయని.. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి సీసీ టీవీల ద్వారా ఊరేగింపును పర్యవేక్షిస్తామని సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు.