Advertisement
Advertisement
Abn logo
Advertisement

గంజాయిని తరిమేద్దాం : CP Anjani Kumar

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ నగరంలో గంజాయి విక్రయాలు, సరఫరా చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నామని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ హెచ్చరించారు. ఎప్పటికప్పుడు వారిని అరెస్ట్‌ చేసి, చర్యలు తీసుకోవడంతో పాటు వరసగా గంజాయికి  సంబంధించి నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇటీవల కాలంలో నగరంలో గంజాయికి సంబంధించిన నేరాల్లో పాల్గొన్న వారిని గుర్తించి 23మందిపై పీడీయాక్ట్‌ నమోదు చేసి జైలుకు పంపించామన్నారు. గంజాయికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు ఇవ్వాలని సీపీ కోరారు. పీఎ్‌సలో లేదా పాట్రోల్‌ కార్‌, బ్లూకోల్ట్స్‌, లేదా 9490616555 వాట్సాప్‌ నెంబర్‌పై సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీసులు, ప్రజలు కలిసి నగరం నుంచి గంజాయిని తరిమేద్దామని సీపీ పిలుపునిచ్చారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement