Abn logo
Sep 18 2021 @ 15:57PM

గణేష్ నిమజ్జనం కోసం భారీ బందోబస్తు: cp anjani kumar

హైదరాబాద్: గణేష్ నిమజ్జనం కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. 2020 లో కరోనా కారణంగా నిమజ్జనాలు జరగలేదన్నారు. ఈ ఏడాది మొదటి సారిగా పీవీ మార్గ్ లోకూడా నిమజ్జనానికి ఏర్పాట్లు చేశామన్నారు. 2.5 లక్షలు గణేష్ విగ్రహాలను జీహెచ్‌ఎంసీ ద్వారా అందజేశారని పేర్కొన్నారు.  దీంతో చాలా విగ్రహాలు ఇంట్లోనే నిమజ్జనం చేస్తున్నారని చెప్పారు. 27 వేల మంది పోలీసులు బలగాల ద్వారా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్, గ్రే హౌండ్స్, ఆక్టోపస్‌తో నిఘా కట్టుదిట్టం చేశామన్నారు. సమస్యాత్మక , అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు. అనుభవం ఉన్న పోలీస్ అధికారులను నగరంలో ఇంచార్జ్‌లుగా నియమించామని పేర్కొన్నారు. జియో ట్యాగింగ్ ద్వారా విగ్రహాల నిమజ్జనం మొత్తం పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. 

తెలంగాణ మరిన్ని...