పశువుల అక్రమ రవాణాపై చర్యలేవి

ABN , First Publish Date - 2020-11-30T07:06:41+05:30 IST

రంపచోడవరం డివిజన్‌ మీదుగా యథేచ్ఛగా సాగుతున్న పశువుల అక్రమ రవాణాపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని అర రంపచోడవరం డివిజన్‌ మీదుగా యథేచ్ఛగా సాగుతున్న పశువుల అక్రమ రవాణాపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని అరకు పార్లమెంట్‌ టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంతల రాజేశ్వరి ప్రశ్నించారు.

పశువుల అక్రమ రవాణాపై చర్యలేవి

 మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి

రాజవొమ్మంగి, నవంబరు 29: రంపచోడవరం డివిజన్‌ మీదుగా యథేచ్ఛగా సాగుతున్న పశువుల అక్రమ రవాణాపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని అర రంపచోడవరం డివిజన్‌ మీదుగా యథేచ్ఛగా సాగుతున్న పశువుల అక్రమ రవాణాపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని అరకు పార్లమెంట్‌ టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంతల రాజేశ్వరి ప్రశ్నించారు. ఆదివారం రాజవొమ్మంగి వచ్చిన ఆమె ఎదురుగా బరకాలను పూర్తిగా మూసివేసి వెళుతున్న వాహనంను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. మూగ జీవాలను తాళ్లతో కాళ్లను కట్టి పెద్ద సంఖ్యలో ఉన్న పశువులను గమనించారు. నిత్యం పదుల సంఖ్యలో ఈ రోడ్డులో పశువులను అక్రమంగా తరిలిస్తున్నారని స్థానికులు మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ వాహనాన్ని నిలిపి ఎస్‌ఐ గోిపీనరేంద్ర ప్రసాద్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన ఆ ప్రాంతానికి చేరుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి దంతులూరి శివరామచంద్రరాజు ఈ వాహనాల రవాణాను అరికట్టి తగుచర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. వీరి వెంట టీడీపీ నేతలు గొల్లపూడి పెద్దిరాజు, లోతా లక్ష్మణరావు, మరిశే శ్రీను, కార్యకర్తలు ఉన్నారు. 


Updated Date - 2020-11-30T07:06:41+05:30 IST