రైల్వేకోడూరులో ఆవుల బెడద

ABN , First Publish Date - 2022-08-11T04:55:50+05:30 IST

పట్టణంలో ఆవుల బెడద ఎక్కువైపోయింది. వీటిని యజమానులు విచ్చలవిడిగా వదిలేయడంతో రోడ్లమీద తిరుగుతూ వాహ నాలకు అడ్డుగా నిలబడడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి తోడు ప్రజలపై తిరగబడి దాడి చేసేందుకు యత్నిస్తుండడంతో ప్రజలు బెంబే లెత్తిపోతున్నారు.

రైల్వేకోడూరులో ఆవుల బెడద
యూనియన్‌ బ్యాంకు వద్ద రాత్రి వేళ తిష్టవేసిన ఆవులు

బెంబేలెత్తుతోన్న ప్రజలు

విచ్చలవిడిగా వదిలేసిన యజమానులు

పట్టించుకోని అధికారులు

రైల్వేకోడూరు, ఆగస్టు 10: పట్టణంలో ఆవుల బెడద ఎక్కువైపోయింది. వీటిని యజమానులు విచ్చలవిడిగా వదిలేయడంతో రోడ్లమీద తిరుగుతూ వాహ నాలకు అడ్డుగా నిలబడడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి తోడు ప్రజలపై తిరగబడి దాడి చేసేందుకు యత్నిస్తుండడంతో ప్రజలు బెంబే లెత్తిపోతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఆవులు ఎక్కడ పడితే అక్కడ విడిది చేసుకుని సంచరిస్తుండడంతో ట్రాఫిక్‌ సమస్య కూడా ఏర్పడు తోందని పలువురు పేర్కొంటున్నారు. 

పట్టణంలోని చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కొందరు ఆవులను ఊర్లోకి వదిలేస్తున్నారు. ఇవి ఉదయం నుంచి రాత్రి వరకు పట్టణంలోని టోల్గేట్‌, పాత బస్టాండు, రైల్వేస్టేషన్‌ రూటు తదితర ప్రాంతాల్లో తిరుగుతుంటాయి. దీంతో తరచూ ట్రాఫి క్‌కు అంతరాయం ఏర్పడుతోంది. అంతే కాకుండా ఆవులు ఒక్కసారిగా పరుగులు తీశాయంటే ప్రజ లపై దాడులు చేస్తున్నాయి. ఇటీవల చిట్వేలి రూటు లో ఆవుల మంద ఒక్కసారి పరు గులు తీసి మోటారు సైకిళ్లలో ప్రయాణిస్తున్న యువకులపై పడి గాయాలపాలు చేశాయి. గతంలో టీడీపీ కార్యాలయం ఎదురుగా ప్రధానదారిలో ఒక వికలాంగుడు నడిచి వెళుతుండగా దాడి చేసి గాయపరిచాయి. వాటి యజమానులు పాలు సేకరించి లబ్ధి పొందు తున్నారే కానీ వాటి యోగక్షేమాలు చూడడం లేదు. గతంలో ఆవుల పెంపకందారులకు పంచాయతీ వారు నోటీసులు ఇచ్చినా ప్రయోజనం లేదని పలు వురు చెబుతున్నారు. పట్టణంలో సుమారు 100కు పైగా ఆవులు ఉన్నాయని స్థానికులు అంటున్నారు. 


ఆవులను గోశాలకు తరలిస్తాం

ఆవులను పెంపకం దారులు అదుపు చేయలేకపోతే వాటిని గోశాలకు తరలిస్తాం. పంచాయితీ సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లతో ఆవులపై చర్చించాము. ఊర్లో ఆవులు నానా హంగామా చేస్తున్నాయి. దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు పంచాయతీతో మరో మారు చర్చించి చర్యలు తీసుకుంటాము. ఆవులు ఎవరివి అనేది పూర్తి స్థాయిలో ఆరా తీస్తాం. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చేస్తాం.

- కె.విశ్వనాథరెడ్డి, సీఐ, రైల్వేకోడూరు


నోటీసులిచ్చి చర్యలు తీసుకుంటాం

ఆవుల పెంపకందారులకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటాము. ఆవులు పట్టణంలో ఎవరివి అనేది తెలుసుకుంటాం. ఆవులను విచ్చలవిడిగా ఊర్లోకి వదలడంతో చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇందుకు పోలీసుల సహకారం తీసుకుని చర్యలు తీసుకుంటాం.

- నౌషద్‌, పంచాయతీ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌



Updated Date - 2022-08-11T04:55:50+05:30 IST