‘కౌది’ కళాకారిణి గంగాబాయి కన్నుమూత

ABN , First Publish Date - 2021-05-08T17:05:23+05:30 IST

‘కౌది’ (గవ్వల అలంకరణ) కళలో పేరొందిన కళాకారిణి గంగాబాయి దేశాయి (75) శుక్రవారం కన్నుమూశారు. హాసన్‌లో గుండెపోటుతో తుదిశ్వాస వీడారు. ఆమె కళను గుర్తించిన స్వచ్ఛంద

‘కౌది’ కళాకారిణి గంగాబాయి కన్నుమూత


బెంగళూరు: ‘కౌది’ (గవ్వల అలంకరణ) కళలో పేరొందిన కళాకారిణి గంగాబాయి దేశాయి (75) శుక్రవారం కన్నుమూశారు. హాసన్‌లో గుండెపోటుతో తుదిశ్వాస వీడారు. ఆమె కళను గుర్తించిన స్వచ్ఛంద సంస్థలు గౌరవించాయి. సొంతప్రాంతం బసనవబాగేవాడి. ఆమె కుమారులలో ఒకరైన బీఎస్‌ దేశాయి కూడా కౌది కళలో రాణించారు. ఆమె మృతిపట్ల హసిరుభూమి బళగ తదితర సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి. 


Updated Date - 2021-05-08T17:05:23+05:30 IST