కరపలో ఎడ్లబండి పోటీలు

ABN , First Publish Date - 2021-01-16T05:31:53+05:30 IST

కరప, జనవరి 15: కరపలో శుక్రవారం కనుమ పండుగ రోజున మండలస్థాయి ఎడ్లబండి పోటీలను నిర్వహించారు. పేకేటి రాముడు జ్ఞాపకార్థం కుటుంబసభ్యులు ఈ పోటీలను నిర్వహించారు. కిలోమీటర్‌ దూరానికి నిర్వహించిన ఈ పందేల్లో కరప, వేపకాయలపాలెం, కొరుపల్లి తదితర

కరపలో ఎడ్లబండి పోటీలు
పోటీలు ప్రారంభిస్తున్న దృశ్యం

కరప, జనవరి 15: కరపలో శుక్రవారం కనుమ పండుగ రోజున మండలస్థాయి ఎడ్లబండి పోటీలను నిర్వహించారు. పేకేటి రాముడు జ్ఞాపకార్థం కుటుంబసభ్యులు ఈ పోటీలను నిర్వహించారు. కిలోమీటర్‌ దూరానికి నిర్వహించిన ఈ పందేల్లో కరప, వేపకాయలపాలెం, కొరుపల్లి తదితర గ్రామాల నుంచి 10మంది రైతులు పాల్గొన్నారు. కరపకు చెందిన పేకేటి దుర్గాశివ, పెదిరెడ్డి వెంకన్నబాబు, ఇళ్ల శ్రీనివాసరావులు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. యాళ్ల సుబ్బరావు, సోసైటీ అధ్యక్షుడు నక్కా వీరభద్రరావు, నక్కా సత్తిబాబు విజేతలకు నగదు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పాట్నీడి భీమేశ్వరరావు, పెంకే సత్తిబాబు, పోలిశెట్టి తాతీలు, చోడపునీడి వెంకటరమణ, ఎ.గంగాధర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-16T05:31:53+05:30 IST