Abn logo
Jan 16 2021 @ 01:31AM

చిరుతపులి దాడిలో ఆవు మృతి

కుభీర్‌, జనవరి 15 : మండలంలోని బ్రహ్మేశ్వర్‌తాండా శివారులో చిరుతపులిదాడిలో ఆవుమృతి చెందినట్లు తండావాసులు తెలిపారు. గ్రామానికి చెందిన మంగీ ళాల్‌ యొక్క ఆవు గత మూడు రోజుల క్రితం మేతకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆ రైతు శివారు ఆటవీ ప్రాంతంలో వెతగ్గా కళేబరం కనిపించగా, చిరుతపులి దాడిలో ఆవు మృతి చెందినట్లు రైతు తెలిపారు. ఈ విషయమై ఫారెస్టు అధికారులతో వివరణ కోరగా ఆవు మృతి చెందిన మాట వాస్తవమేనని, కాని చిరుతపులి దాడిలో మృతి చెందిదా...? ఇతర వణ్యప్రాణుల దాడిలో మృతి చెందిదా..? అని తెలియదని, ఆవు మృతి చెంది మూడు రోజులు అయినట్లు తెలిపారు. శుక్రవారం రాత్రి ఆ కళేబేరాన్ని పులి తింటుందా లేదా ఇతర వన్య ప్రాణులు తింటాయో గమనించి శనివారం ఉదయం వివరాలు తెలుపుతామని తెలిపారు. 

Advertisement
Advertisement