గో సంరక్షణశాల పరిశీలన

ABN , First Publish Date - 2021-05-12T05:46:45+05:30 IST

శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న గోసంరక్షణశాల, వైద్యశాలలోని సదుపాయాలను మంగళవారం ఈవో కేఎస్‌ రామరావు పరిశీలించారు.

గో సంరక్షణశాల పరిశీలన
గో సంరక్షణశాలను పరిశీలిస్తున్న ఈవో కేఎస్‌ రామరావు, అధికారులు

 శ్రీశైలం, మే 11: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న గోసంరక్షణశాల, వైద్యశాలలోని సదుపాయాలను మంగళవారం ఈవో కేఎస్‌ రామరావు పరిశీలించారు. ఈ సందర్భంగా  ఈవో మాట్లాడుతూ గోవులకు ఎండ   తగలకుండా   అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని గో సంరక్షణశాల విభాగపు అధికారులను  ఆదేశించారు. ప్రతి గోవు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, గోవులకు తగినంత మేత, తాగునీరు అందేలా  చర్యలు తీసుకోవాలన్నారు.   ఆవులకు  నీటితొట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సహాయ కార్యనిర్వాహణాధికారి క్రిష్ణారెడ్డి, పర్యవేక్షకులు మధుసుదన్‌ రెడ్డి పాల్గొన్నారు. 


వైద్యశాలలోని సదుపాయాల పరిశీలన: శ్రీశైల దేవస్థానం పరిధిలోని వైద్యశాలను మంగళవారం ఈవో కేఎస్‌ రామరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ కొవిడ్‌ నిబంధనల మేరకు వైద్యసేవలను అందించాలన్నారు. వైద్యశాలను ఎప్పటికప్పుడు శాస్త్రీయ పద్ధ్దతిలో శానిటైజేషన్‌ చేయించాలని వైద్యశాల అధికారులను ఆదేశించారు. వైద్యశాలకు చికిత్స కోసం వచ్చే వారికి కరోన నిబంధనలపై అవగాహన కల్పించాలని వైద్యశాల సిబ్బందిని ఆదేశించారు.  ఈ పరిశీలనలో దేవస్థానం వసతి, వైద్యవిభాగాల సహయ కార్యనిర్వహణాధికారి డి.మల్లయ్య, పర్యవేక్షకులు స్వాములు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-12T05:46:45+05:30 IST