కొవిషీల్డ్‌ రెండో డోసు గడువు పెంపు

ABN , First Publish Date - 2021-05-14T07:23:25+05:30 IST

కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కు సంబంధించిన రెండు డోసుల మధ్య కాల వ్యవధిని మళ్లీ పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మొదటి డోసు తీసుకున్న....

కొవిషీల్డ్‌ రెండో డోసు గడువు పెంపు

న్యూఢిల్లీ, మే 13 (ఆంధ్రజ్యోతి): కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కు సంబంధించిన రెండు డోసుల మధ్య కాల వ్యవధిని మళ్లీ పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మొదటి డోసు తీసుకున్న తర్వాత 6 నుంచి 8 వారాల మధ్యలో రెండో డోసు తీసుకోవాలన్న నిబంధన ఉంది. ఆ వ్యవధిని 12 నుంచి 16 వారాలకు పెంచాలని డాక్టర్‌ ఎన్‌కే అరోరా నేతృత్వంలోని కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సిఫారసు చేసింది. దానిని ఆమోదించినట్లు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే, కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ డోసుల విషయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. కాగా, వర్కింగ్‌ గ్రూప్‌ చేసిన ఈ సిఫారసును తొలుత నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ నేతృత్వంలోని జాతీయ నిపుణుల బృందం బుధవారం ఆమోదించిందని ఆరోగ్య శాఖ తెలిపింది. టీకాల కొరతపై పద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

Updated Date - 2021-05-14T07:23:25+05:30 IST