కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహలు వీడాలి

ABN , First Publish Date - 2021-09-18T06:29:47+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌పై ప్రజలు అపోహలు వీడాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ సమీప కేంద్రంలో వ్యాక్సిన్‌ తీసుకోవాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు.

కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహలు వీడాలి
వేములవాడలో వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి)/ వేము లవాడ :   కొవిడ్‌ వ్యాక్సిన్‌పై ప్రజలు అపోహలు వీడాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ సమీప కేంద్రంలో వ్యాక్సిన్‌ తీసుకోవాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. వేములవాడ పట్టణంలోని ఉప్పుగడ్డ, వైశ్య సత్రం, సుభాషన్‌గర్‌, విద్యానగర్‌, గాంధీనగర్‌, మార్కండేయనగర్‌లలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ 19 వ్యాక్సినేషన్‌ కేంద్రాలను శుక్రవారం తనిఖీ చేశారు. టీకాతోనే కొవిడ్‌ మహమ్మారి అదుపులోకి వస్తుందని, టీకాపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. కరోనా రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవడం ఒక్కటే మార్గమన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌మోహన్‌రావు మాట్లాడుతూ నాలుగు రోజులుగా జిల్లాలో నిర్వహిస్తున్న వ్యాక్సిన్‌ ప్రత్యేక డ్రైవ్‌లో 41,759 మందికి టీకా వేశామన్నారు. 

ఇంటింటా వ్యాక్సినేషన్‌పై అవగాహన 

కొవిడ్‌నియంత్రణకు వ్యాక్సిన్‌ ఆయుధంగా నిలు స్తు ందని వార్డుల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాలను సద్వి నియోగం చేసుకోవాలని శుక్రవారం సిరిసిల్లలోని ము న్సిపల్‌ పరిధిలోని సుభాష్‌నగర్‌లో ఇంటింటికి వెళ్లి అవ గాహన కల్పించారు. శిబిరానికి తీసురొచ్చి వ్యాక్సిన్‌ చేయి ంచారు. కౌన్సిలర్లు దార్నం అరుణ, వెల్దండి దేవదాస్‌, డాక్టర్‌ సంపత్‌, అంగన్‌వాడీ టీచర్లు, అంజని, శాంత, విజయ, ఆర్పీలు సుచిత్ర, సంధ్య, సుజాత పాల్గొన్నారు. 

 సిరిసిల్ల రూరల్‌:  ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ వేసుకోవాలని సిరిసిల్ల మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య కోరారు. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని 9వ వార్డు పెద్దూర్‌ తుర్క కాశిపల్లె, రగుడు, చంద్రంపేట గ్రామాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్‌ కేంద్రాలను   పరిశీలించారు.  కౌన్సిలర్లు లింగంపల్లి సత్యనారాయణ, సత్య,  రాజిరెడ్డి, డాక్టర్‌ సంతోష్‌, వార్టు అధ్యక్షుడు షేక్‌ అలీ,  తిరుపతి, ఎల్లయ్య పాల్గొన్నారు. 

 ఇల్లంతకుంట :మండలంలోని ఇల్లంతకుంట, సోమారంపేట, అనంతగిరి, పెద్దలింగాపూర్‌తోపాటు 11 గ్రామాల్లో శుక్రవారం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వైద్యాధికారులు సుభాషిణి, రామకృష్ణ, సర్పంచులు నారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహరెడ్డి,  జితేందర్‌గౌడ్‌, భాగ్యలక్ష్మి, వాణి, వెంకటరెడ్డి, మల్లయ్య, కరుణ, పర్శరాం తదితరులు పాల్గొన్నారు.

 చందుర్తి:వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని అద నపు కలెక్టర్‌  సత్యస్రసాద్‌ అన్నారు. మల్యాల, దేవు ని తండాల్లో వ్యాక్సినేషన్‌  శిబిరాలను  పరిశీలించారు. జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు, ఎంపీడీవో రవీందర్‌, మండల వైద్యాధికారి మసూద్‌, ఏపీఎం రజిత, ఎంపీవో ప్రదీప్‌, సర్పంచ్‌లు లక్ష్మీనారాయణ, పంతులు ఉన్నారు.

Updated Date - 2021-09-18T06:29:47+05:30 IST