కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 60 లక్షలు దాటింది: హాప్కిన్స్ యూనివర్శిటి

ABN , First Publish Date - 2020-07-06T05:57:56+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 60 లక్షలు దాటినట్టు

కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 60 లక్షలు దాటింది: హాప్కిన్స్ యూనివర్శిటి

వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 60 లక్షలు దాటినట్టు అమెరికాకు చెందిన జాన్ హాప్కిన్స్ యూనివర్శిటి తాజాగా వెల్లడించింది. మరోపక్క ఆదివారం ఉదయానికి ప్రపంచవ్యాప్తంగా 5,30,898 మంది మరణించినట్టు తెలిపింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కోటి 12 లక్షల 72 వేల 342 మంది కరోనా బారిన పడ్డారు. అమెరికా, బ్రెజిల్ దేశాలు అత్యధిక కేసులు నమోదైన దేశాలుగా ముందు స్థానంలో ఉన్నాయి. అమెరికాలో ఇప్పటివరకు 29 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా.. బ్రెజిల్‌లో 15 లక్షలకు పైగా కరోనా బారిన పడ్డారు. మరోపక్క అమెరికాలో ఇప్పటివరకు దాదాపు 13 లక్షల మంది, బ్రెజిల్ నుంచి దాదాపు పది లక్షల మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఈ రెండు దేశాల తర్వాతి స్థానాల్లో ఇండియా, రష్యా, పెరు దేశాలున్నాయి. ప్రపంచదేశాల్లో కరోనా ఆంక్షలు ఎత్తివేయడంతో కేసులు విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. అమెరికాలో నిత్యం 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ సంఖ్య లక్షకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2020-07-06T05:57:56+05:30 IST