Apr 22 2021 @ 01:11AM

ప్రభాస్‌ మేకప్‌మన్‌కు కొవిడ్‌19 పాజిటివ్‌!

ప్రభాస్‌ వ్యక్తిగత సిబ్బందిలో ఒకరు కరోనా బారిన పడ్డారు. ఆయన మేకప్‌మన్‌కు కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అందుకని, ‘రాధే శ్యామ్‌’ చిత్రీకరణను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రభాస్‌ సహా చిత్రబృందమంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ సెట్స్‌ మీదకు వెళ్లాలని, అప్పటివరకూ చిత్రీకరణను నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజులు చిత్రీకరణ చేస్తే సినిమా పూర్తవుతుంది. కానీ, పరిస్థితులు అనుకూలించడం లేదు. ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యు.వి. క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో ప్రభాస్‌ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. వంశీ, ప్రమోద్‌, ప్రసీధ నిర్మాతలు.