కరోనా కల్లోలంతో పాకిస్తాన్ విలవిల.. రోడ్డునపడ్డ 30 లక్షల మంది..

ABN , First Publish Date - 2020-06-06T16:46:39+05:30 IST

కరోనా కల్లోలం కారణంగా పాకిస్తాన్‌లో పారిశ్రామిక, సేవారంగాలకు సంబంధించి 30 లక్షల మంది ...

కరోనా కల్లోలంతో పాకిస్తాన్ విలవిల.. రోడ్డునపడ్డ 30 లక్షల మంది..

ఇస్లామాబాద్: కరోనా కల్లోలం కారణంగా పాకిస్తాన్‌లో పారిశ్రామిక, సేవారంగాలకు సంబంధించి 30 లక్షల మంది ఉపాధి కోల్పోయినట్టు పాక్ ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఈ సంక్షోభంతో ఇప్పటి వరకు 24.3 శాతంగా ఉన్న పేదరికం స్థాయి 33.5 శాతానికి పెరిగే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. సేవా రంగంలో 20 లక్షల మంది వరకు ఉపాధి కోల్పోగా.. పరిశ్రమల్లో పనిచేస్తున్న 10 లక్షల మంది వరకు రోడ్డున పడినట్టు వెల్లడించింది. ఈ మేరకు నిన్న పాక్ పార్లమెంటులోని ఎగువ సభ అయిన సెనేట్‌కు ఆర్థిక శాఖ నివేదిక సమర్పించింది.


కరోనా సంక్షోభానికి ముందు జీడీపీ వృద్ధి రేటు 3.24 శాతంగా అంచనా వేయగా... ఈ ఆర్థిక సంవత్సరంలో అది -0.4 శాతానికి పడిపోయినట్టు పాక్ ఆర్థిక శాఖను ఉటంకిస్తూ జిన్హువా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ద్రవ్యలోటు సైతం ఇంతకు ముందు 7.5 శాతం వరకు ఉండగా.. కరోనా సంక్షోభం కారణంగా ఇప్పుడది జీడీపీలో 9.4 శాతానికి ఎగబాకింది. కాగా పాకిస్తాన్‌లో ఇప్పటి వరకు 89,249 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,838 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Updated Date - 2020-06-06T16:46:39+05:30 IST