భారత్‌లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కలకలం

ABN , First Publish Date - 2022-04-06T23:15:48+05:30 IST

ముంబై: భారత్‌లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. ముంబైలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్‌ఈ తొలి కేసు నమోదైంది.

భారత్‌లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కలకలం

ముంబై: భారత్‌లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. ముంబైలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్‌ఈ తొలి కేసు నమోదైంది. తాజాగా 230 శాంపిల్స్ పరీక్షించగా 228 మందికి ఒమిక్రాన్, ఒకరికి ఎక్స్‌ఈ, ఒకరికి కప్పా వేరియంట్ సోకినట్లు గుర్తించామని వైద్యులు తెలిపారు.  దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. బ్రిటన్‌లో జనవరి 19న తొలి ఎక్స్‌ఈ కేసు నమోదైంది.  




దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 1,086 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో క్రీయాశీలక కేసుల సంఖ్య 11 వేల 871. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకూ  కోలుకున్న వారి సంఖ్య 4 కోట్ల 24 లక్షలు దాటింది.


మరోవైపు జాతీయ టీకాకరణలో భాగంగా దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 185 కోట్ల 4 లక్షలకు పైగా కోవిడ్ టీకాలు వేశారు. అటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటి వరకు 185 కోట్ల 79 లక్షల వ్యాక్సిన్ డోసులు ఉచితంగా అందించామని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. 15 కోట్ల 70 లక్షలకు పైగా వినియోగించని వ్యాక్సిన్ డోసులు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వశాఖ తెలిపింది. 

Updated Date - 2022-04-06T23:15:48+05:30 IST