భయపడాల్సిన అవసరం లేదు: కోవిడ్ పరిస్థితిపై సీఎం కేజ్రీవాల్

ABN , First Publish Date - 2022-01-02T18:53:02+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని, కానీ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

భయపడాల్సిన అవసరం లేదు: కోవిడ్ పరిస్థితిపై సీఎం కేజ్రీవాల్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని, కానీ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో కోవిడ్ పరిస్థితులపై సీఎం కేజ్రీవాల్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి కానీ, ఆసుపత్రిలో చేరే కేసులు తగ్గుతున్నాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు’ అని ప్రజలకు ధైర్యం చెప్పారు. ప్రస్తుతం చాలా కోవిడ్ కేసులు తేలికపాటి తేలికపాటి లక్షణాలతో నమోదు అవుతున్నాయన్నారు. చాలామంది కోవిడ్ రోగులు ఆసుపత్రుల్లో చేరకుండానే కోలుకుంటున్నారని తెలిపారు. ఢిల్లీలో 246 ఆసుపత్రుల్లో దాదాపు 37 వేలకు పైగా ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయని, ప్రస్తుతానికి 82 బెడ్స్‌లో మాత్రమే కరోనా రోగులు ఉన్నారని కేజ్రీవాల్ వివరించారు. సెకెండ్ వేవ్‌తో పోలిస్తే ప్రస్తుతం కోవిడ్ తీవ్రత తక్కువగా ఉందని, అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సామాజిక దూరం పాటిస్తూ మాస్కు ధరించాలని చెప్పారు. 

Updated Date - 2022-01-02T18:53:02+05:30 IST