చండీగఢ్: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను కఠినతరం చేసింది. మాస్క్‌లను ధరించని వారికి రూ.500 జరిమానా విధిస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. గురుగ్రామ్, ఫరీదాబాద్, సోనిపట్, ఝజ్జర్ జిల్లాల్లో కోవిడ్-19 పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రజలను కోరారు. ప్రజలు మాస్క్‌లు ధరించాలని, ఉల్లంఘనకు పాల్పడితే రూ.500 జరిమానా విధిస్తామని సీఎం తెలిపారు. దేశంలో మళ్లీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇవి కూడా చదవండి