వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ ఎట్‌ గుంటూరు

ABN , First Publish Date - 2020-11-25T05:06:10+05:30 IST

ప్రపం చాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేసే మహాయజ్ఞంలో గుంటూరూ భాగ స్వామి కాబోతుంది. కొవిడ్‌-19 నివారణకు భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) కొవాగ్జిన్‌ టీకా మందు తయారీకి నడుం బిగించిన సంగతి తెలిసిందే.

వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ ఎట్‌ గుంటూరు

ఫేజ్‌-3కు ఫీవర్‌ హాస్పిటల్‌ ఎంపిక

1000 మంది వలంటీర్లపై కరోనా టీకా ప్రయోగం

మహాయజ్ఞంలో గుంటూరు వాసుల భాగస్వామ్యం


గుంటూరు(మెడికల్‌), నవంబరు 24: ప్రపం చాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేసే మహాయజ్ఞంలో గుంటూరూ భాగ స్వామి కాబోతుంది. కొవిడ్‌-19 నివారణకు భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) కొవాగ్జిన్‌ టీకా మందు తయారీకి నడుం బిగించిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్‌ ప్రయోగాలు తుది దశకు చేరాయి. కొవాగ్జిన్‌ ఫేజ్‌-3 క్లినికల్‌ ట్రయల్స్‌ బుధవారం నుంచి గుం టూరు జ్వరాల ఆసుపత్రిలో ప్రారంభం కాను న్నాయి. మొదటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో చక్కటి ఫలితాలు కనిపించినట్లు ఇప్పటికే భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. కొద్ది మందిలో స్వల్పంగా జ్వరం, ఇంజెక్షన్‌ చేసిన చోట కొద్దిగా నొప్పి వంటి లక్షణాలు మాత్రమే కనిపించినట్లు సంస్థ పేర్కొం ది. ఈ నేపథ్యంలో మూడోది, చివరి దశ అయిన ఫేజ్‌-3 క్లినికల్‌ ట్రయల్స్‌కు శ్రీకారం చుట్టారు. ప్యాన్‌ ఇండియా స్ధాయిలో దేశంలో పలు కేంద్రా ల్లో కొవాగ్జిన్‌ ఫేజ్‌-3 క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టారు. దేశంలో ఎంపిక చేసిన వివిధ ఆసుపత్రుల్లో మొత్తం 28,500 మంది వ లంటీర్లపై ఈ టీకా మందు ప్రయోగిం చి చూస్తారు. బుధవారం నుంచి గుం టూరు నగరంలోని గవర్నమెంట్‌ ఫీవర్‌ హాస్పిటల్‌లో క్లినికల్‌ ట్ర యల్స్‌ను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇందుకోసం వెయ్యి మంది వలంటీర్లను ఎం పిక చేశారు.


వ్యాక్సిన్‌ ప్రయోగం ఇలా...

గుంటూరు వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగంలో వలంటీర్లకు స్ర్కీనింగ్‌ పరీక్షలు జరుపుతున్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలు ఉన్నా వలంటీర్లుగా రిజిస్టర్‌ చేసుకునేందుకు అర్హులని వైద్యాధికారులు తెలిపారు. కోమార్బిడిటీస్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాలకు ఆటంకం కాదని స్పష్టం చేశారు. కాగా వలంటీర్ల కనిష్ఠ వయోపరిమితి 18 ఏళ్లుగా నిర్ణయించారు. గరిష్ఠ వయో పరిమితి లేదు. ప్రతి రోజూ ఫీవర్‌ హాస్పిటల్‌లో వలంటీర్లకు కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ ఇస్తారు. రోజుకు 50 మంది చొప్పున మూడు వారాల్లో వెయ్యి మందికి వ్యాక్సినేషన్‌ చేయాలని నిర్ణయించారు. ప్రతి వలంటీర్‌కు రెండు మోతాదుల్లో టీకా మందు ఇస్తారు. మొదటి మోతాదు ఇచ్చిన 28 రోజుల అనంతరం రెండో డోసు వ్యాక్సిన్‌ ఇస్తారు. వ్యాక్సిన్‌ తీసుకున్న 60 రోజుల తర్వాత వారిలో యాంటీబాడీ రెస్పాన్స్‌ను పరిశీలిస్తారు.


వ్యాక్సిన్‌ సురక్షితం...

యాంటీబాడీస్‌  రెస్పాన్స్‌ సంతృప్తికరంగా ఉంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో పెద్ద ఎత్తున కొవాగ్జిన్‌ను మా ర్కెట్‌లోకి ప్రవేశపెడతామని భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. దీనికి సంబంధించిన అను మతులకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకొంది. కొవాగ్జిన్‌ ఇనాక్టివేటెడ్‌ నావెల్‌ వైరస్‌ వ్యాక్సిన్‌. ఇందులో సింథటిక్‌ ప్రొటీన్‌ సమ్మేళనం ఉండటం వల్ల టీకా మందు పూర్తిగా సురక్షితమని, 70 శాతంపైగా వ్యాక్సిన్‌ సమర్ధవంతంగా కరోనాను నివారిస్తుందని భారత్‌ బయోటెక్‌ తెలిపింది. అతి తక్కువ ధరకే కొవాగ్జిన్‌ను మార్కెటింగ్‌ చేస్తామని ప్రకటించింది. కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌లో వలంటీర్లుగా పాల్గొనేందుకు ఆరోగ్య సిబ్బంది సైతం ఆసక్తి చూపుతున్నారు. వలంటీర్లుగా ఐదు శాతం మంది ఆరోగ్య సిబ్బందిని ఎంపిక చేసేందుకు భారత్‌ బయోటెక్‌, ఐసీఎంఆర్‌ ఆమోదం తెలిపాయి. ఆసక్తి ఉన్న జిల్లావాసులు ఐడీహెచ్‌ వైద్యాధికారులను సంప్రదించి ఈ క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగస్వాములు కావచ్చు.


Updated Date - 2020-11-25T05:06:10+05:30 IST