కొవిడ్‌ బాఽధితులు అధైర్యపడొద్దు

ABN , First Publish Date - 2021-05-17T05:42:19+05:30 IST

కరోనా బారినపడిన వారు ఏమాత్రం అధైర్యపడవద్దని, రాష్ట్ర ప్రభుత్వం అం డగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. ఆదివారం ఆయన భీమ్‌గల్‌ పట్టణంతో పాటు మండలంలోని ముచ్కూర్‌ గ్రామంలో, మోర్తాడ్‌ మండల కేంద్రంలోని బద్దంవాడలో, కమ్మర్‌పల్లి మండలంలో, వేల్పూర్‌ మండల ంలోని రామన్నపేట్‌, లక్కోర, వేల్పూర్‌ గ్రామాల్లో పర్యటించారు.

కొవిడ్‌ బాఽధితులు అధైర్యపడొద్దు
మోర్తాడ్‌లో ఇంటింటికీ తిరుగుతూ అవగాహన కల్పిస్తున్న మంత్రి

బాధిత కుటుంబాలకు ధైర్యాన్నిచ్చిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
భీమ్‌గల్‌/భీమ్‌గల్‌ రూరల్‌/మోర్తాడ్‌/వేల్పూర్‌/కమ్మర్‌పల్లి మే 16: కరోనా బారినపడిన వారు ఏమాత్రం అధైర్యపడవద్దని, రాష్ట్ర ప్రభుత్వం అం డగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. ఆదివారం ఆయన భీమ్‌గల్‌ పట్టణంతో పాటు మండలంలోని ముచ్కూర్‌ గ్రామంలో, మోర్తాడ్‌ మండల కేంద్రంలోని బద్దంవాడలో, కమ్మర్‌పల్లి మండలంలో, వేల్పూర్‌ మండల ంలోని రామన్నపేట్‌, లక్కోర, వేల్పూర్‌ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటి సర్వేను పరిశీలించి సర్వే నిర్వహిస్తున్న వారితో మాట్లాడి వివ రాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికీ తిరిగి కొవిడ్‌ బాధితులతో మాట్లాడి వారికి ఽఽధైర్యాన్ని ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని, ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌లు అందుబాటులో ఉంచామన్నారు. ప్రతీ పీహెచ్‌సీ వైద్య సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసు కో వడం జరిగిందన్నారు. గ్రామాల్లో వ్యాధి లక్షణాలు ఉన్న వారు ఉంటే వారి వి వరాలను గ్రామ కార్యదర్శికి గానీ, స్థానిక ప్రజాప్రతినిధులకు గానీ తెలిపితే వారి కి కిట్లను అందజేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం మంత్రి అధికారులతో సమీక్షించి కొవిడ్‌ బాధితులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి వెంట ఆర్మూర్‌ ఆర్డీవో శ్రీనివాసులు, డిప్యూటీ డీఎంఅం డ్‌హెచ్‌వో రమేష్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, అఽధికారులు ఉన్నారు.

Updated Date - 2021-05-17T05:42:19+05:30 IST