కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2021-01-16T05:14:35+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా వైద్యశాల కేంద్రంలో అంతా సిద్ధం చేసినట్లు ఆసుపత్రి

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు పూర్తి
వ్యాక్సినేషన్‌పై సమీక్షిస్తున్న ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సుబ్బారెడ్డి

ఆత్మకూరు, జనవరి 15 : కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా వైద్యశాల కేంద్రంలో అంతా సిద్ధం చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎంవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ కార్యక్ర మం ప్రారంభంపై ఆయన వైద్యశాలలోని డాక్టర్లు, సిబ్బంది, పలు పార్టీల నేతలతో సమీక్షించారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనప్రాయంగా ప్రా రంభిస్తారని తెలిపారు. ముందుగా నమోదు చేసుకున్న 154 మంది డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బందితో పాటు ఆశావర్కర్లు, పోలీసు, రెవెన్యూ సిబ్బందికి వ్యాక్సిన్‌ వేస్తామన్నారు. ఈ కార్యక్రమం 5 రోజుల పాటు కొనసాగు తుందన్నారు. ముందుగా పలువురు వైసీపీ, బీజేపీ నేతలు ఏర్పాట్లుపై పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎం డాక్టర్‌ ఉషాసుం దరి, డాక్టర్‌ విజయభాస్కర్‌రెడ్డి, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-01-16T05:14:35+05:30 IST