కొవిడ్‌ వ్యాక్సిన్‌ రావడానికి 6 నెలలు పట్టొచ్చు

ABN , First Publish Date - 2020-07-06T13:45:54+05:30 IST

కరోనా కట్టడికి భారత్‌ బయోటెక్‌ అభివృద్ధిచేసిన వ్యాక్సిన్‌ను ఆగస్టు 15కల్లా తీసుకొస్తామని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) చేసిన ప్రకటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పందించింది. కొవిడ్‌ వ్యాక్సిన్‌

కొవిడ్‌ వ్యాక్సిన్‌ రావడానికి 6 నెలలు పట్టొచ్చు

  • డబ్ల్యూహెచ్‌వో ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ 


న్యూఢిల్లీ/బెర్లిన్‌, జూలై 5: కరోనా కట్టడికి భారత్‌ బయోటెక్‌ అభివృద్ధిచేసిన వ్యాక్సిన్‌ను ఆగస్టు 15కల్లా తీసుకొస్తామని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) చేసిన ప్రకటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పందించింది. కొవిడ్‌ వ్యాక్సిన్‌ అంత త్వరగా అందుబాటులోకి రావడం అసాధ్యమని డబ్ల్యూహెచ్‌వో ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ తెలిపారు. ప్రయోగ పరీక్షలు మూడు దశలను దాటుకొని సజావుగా ముందుకుసాగినా వ్యాక్సిన్‌ రావడానికి కనీసం ఆరు నుంచి తొమ్మిది నెలలు పట్టొచ్చన్నారు.


రోగ నిరోధక శక్తిని పెంచే సామర్ధ్యపు సమాచారం ఒక్కటే వ్యాక్సిన్‌ విశ్వసనీయతకు ప్రాతిపదిక కాదని.. డబ్ల్యూహెచ్‌వో జారీచేసిన టార్గెట్‌ ప్రొడక్ట్‌ ప్రొ ఫైల్స్‌ ప్రమాణాలకు అనుగుణంగా అది ఉండాలన్నారు. కాగా, కరోనా రోగులపై హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ పనిచేస్తోందా? చేయడం లేదా? తెలుసుకునేందుకు తాము నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్షలను నిలిపివేస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. హైడ్రాక్సీతో పాటు హెచ్‌ఐవీ ఔషధాలు లోపిన్‌అవిర్‌, రిటోన్‌అవిర్‌లతో నిర్వహిస్తున్న ప్రయోగాలనూ నిలిపివేస్తున్నట్లు తెలిపింది.  


Updated Date - 2020-07-06T13:45:54+05:30 IST