976మందికి వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-01-19T07:34:03+05:30 IST

కోవిడ్‌ వ్యాక్సిన్‌ ను సోమవారం 976మందికి వేశారు.

976మందికి వ్యాక్సిన్‌
స్విమ్స్‌లో టీకా వేయించుకుంటున్న డైరెక్టర్‌ వెంగమ్మ

చిత్తూరు రూరల్‌, జనవరి 18: కోవిడ్‌ వ్యాక్సిన్‌ ను సోమవారం 976మందికి వేశారు.1822మందిని ఎంపి క చేయగా 846 మంది వ్యాక్సినేషన్‌కు దూరంగా వుండి పోయారు. 53.6 శాతం మంది మాత్రమే టీకా వేయించుకున్నారు. నియోజకవర్గాల వారీగా.... పీలేరులో 47 మందికి గాను 35మంది, మదనపల్లెలో 126 మందికి  85 మంది, తంబళ్లపల్లెలో 70మందికి 9మంది, పుంగ నూరులో 129మందికి 81మంది, పలమనేరులో67మందికి 40మంది, కుప్పంలో 66మందికి 54మంది, పూతలపట్టు లో 112మందికి 102 మంది, జీడీ నెల్లూరులో 179 మంది కి  115మంది, చంద్రగిరిలో 154 మందికి 94మంది, సత్య వేడులో 36మందికి ఏడుగురు, తిరుపతిలో 200 మందికి 129మంది, నగరిలో 155మందికి 48మంది, శ్రీకాళహస్తిలో 161 మందికి 59మంది, చిత్తూరులో 220 మందికి 80 మంది వ్యాక్సిను వేయించుకున్నారు. అత్యల్పంగా కురబలకోట పీహెచ్‌సీలో 70మందికి కేవలం 9మందే వ్యాక్సిన్‌ వేసుకోగా నారాయణవనం పీహెచ్‌సీలో 12మందికి గాను ఎవరూ వ్యాక్సిన్‌ వేసుకోలేదు.


షెడ్యూల్‌లో లేనివారికి వ్యాక్సిన్‌ ఇవ్వొద్దు: డీఎంహెచ్‌వో

 కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ షెడ్యూల్‌లో లేనివారికి వ్యాక్సిన్‌ ఇవ్వొద్దని డీఎంహెచ్‌వో పెంచలయ్య ఆదేశించారు. సోమవారం పీహెచ్‌సీ వైద్యాధికారులతో టెలీకాన్ఫరెన్‌ నిర్వహించారు. షెడ్యూల్‌ ప్రకారం జిల్లాలోని 29 కేంద్రాల్లో రోజూ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వ్యాక్సినేషన్‌ చేయాలన్నారు. పబ్లిక్‌ హాలిడేస్‌, పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహించే మూడ్రోజులు మాత్రమే వ్యాక్సినేషన్‌ జరగదన్నారు. టీకా వేయించుకున్న వారందరికీ సర్టిఫికెట్లు ప్రింట్‌ తీసి ఇవ్వాలని చెప్పారు.ఎస్‌వో రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-19T07:34:03+05:30 IST