నిబంధనలను వ్యతిరేకంగా వ్యాక్సినేషన్ కేంద్రాల ధ్వంసం

ABN , First Publish Date - 2021-08-12T07:01:12+05:30 IST

వ్యాక్సినేషన్ కేంద్రాలను ధ్వంసం చేసిన ఘటన ఫ్రాన్స్‌లో చోటు చేసుకుంది. కరోనా విజృంభిస్తున్న వేళ.. ప్రభుత్వాలు వ్యాక్సిన్ పంపిణీపై దృష్టిపెట్టాయి. ఫ్రాన్స్ కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది

నిబంధనలను వ్యతిరేకంగా వ్యాక్సినేషన్ కేంద్రాల ధ్వంసం

న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ కేంద్రాలను ధ్వంసం చేసిన ఘటన ఫ్రాన్స్‌లో చోటు చేసుకుంది. కరోనా విజృంభిస్తున్న వేళ.. ప్రభుత్వాలు వ్యాక్సిన్ పంపిణీపై దృష్టిపెట్టాయి. ఫ్రాన్స్ కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది. కాగా.. కొవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడం కోసం ఫ్రాన్స్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన నిబంధనలను అక్కడి పౌరులు వ్యతిరేకిస్తున్నారు. హెల్త్ పాస్ పేరుతో వ్యాక్సిన్ వేయించుకున్న, కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ పొందిన వారిని మాత్రమే రెస్టారెంట్‌లు, పబ్లిక్ ప్రదేశాలకు అక్కడి ప్రభుత్వం అనుమతిస్తోంది. దీంతో ఈ నిబంధనలపై అక్కడి ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నిరసనకారులు దాదాపు 20కిపైగా వ్యాక్సినేషన్ కేంద్రాలను, హెల్త్ సెంటర్లను ధ్వంసం చేశారు. నిబంధనలపేరుతో ప్రభుత్వం తమ స్వేచ్ఛను హరిస్తోందని ఆందోళనకారులు ఆరోపించారు.  


Updated Date - 2021-08-12T07:01:12+05:30 IST