తెలంగాణలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సక్సెస్‌: శ్రీనివాస్‌

ABN , First Publish Date - 2021-01-16T22:39:48+05:30 IST

తెలంగాణలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ విజయవంతమైందని హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. గాంధీలో క్రిష్ణమ్మ, నార్సింగ్‌లో జయమ్మ తొలి టీకా వేసుకున్నారని

తెలంగాణలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సక్సెస్‌: శ్రీనివాస్‌

హైదరాబాద్: తెలంగాణలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ విజయవంతమైందని హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. గాంధీలో క్రిష్ణమ్మ, నార్సింగ్‌లో జయమ్మ తొలి టీకా వేసుకున్నారని, వాక్సిన్ వేసుకున్న వాళ్లంతా రోల్ మోడల్స్ అని చెప్పారు. వాక్సిన్ పూర్తి సేఫ్ అని తేలిపోయిందన్నారు. 20 మందికి టీకా వేసుకున్న చోట ఎర్రబడిందని, ఇది సమస్య కాదని చెప్పారు. వాక్సిన్ వేసుకున్నవారి ఆరోగ్యాన్ని ట్రాక్‌ చేస్తామని తెలిపారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల వాళ్లకు వచ్చేవారంలో టీకా వేస్తామని శ్రీనివాస్‌ ప్రకటించారు. వాక్సిన్ వేసుకున్న వాళ్లు కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇవాళ తెలంగాణలో 3,530 మంది వాక్సిన్ తీసుకున్నారని శ్రీనివాస్‌ తెలిపారు.


నేడు రాష్ట్రవ్యాప్తంగా మొదటి డోసు కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 140 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ఏర్పాటు చేశారు. మొదటి రోజు 4,170 మంది వైద్యారోగ్యశాఖ సిబ్బందికి వ్యాక్సినేషన్‌ ఇచ్చారు. నిమ్స్‌లో టీకా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రారంభించారు. గాంధీ ఆస్పత్రిలో టీకాను మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. తిలక్‌నగర్‌లోని యూహెచ్‌సీలో టీకాను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. గాంధీ ఆస్పత్రి, నార్సింగిలోని సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని మోదీ మాట్లాడారు.

Updated Date - 2021-01-16T22:39:48+05:30 IST